ఈ రోజు సర్వసమాజ్ కమిటీ భీంగల్ వారి ఆధ్వర్యం లో అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మెంబర్స్ ఆధ్వర్యం లో భీంగల్ తహసీల్దార్ మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు చెయ్యాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతం లో 2007 సంవత్సరం లో భీంగల్ లో కోర్టు సంక్షన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి గజీట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కాని కొన్ని కారణాల వల్ల కోర్టు ఆర్మూర్ వెళ్లడం జరిగింది కోర్టు ఆర్మూర్ లో ఉండటం వల్ల ఇక్కడి ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరైన సమయానికి కోర్టు చేరుకోలేక పోతున్నారు. భీంగల్ నూతన మున్సిపాలిటీ గా ఏర్పడింది కావున కోర్టు ఉండాలి .కోర్టు కు కావాల్సిన అన్ని అర్హతలు భీంగల్ పట్టణానికి ఉన్నవి అని వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శేవ్వ అశోక్, ఉప అధ్యక్షుడు, గంగదాస్, లింబాద్రి నర్సయ్య, సత్యనారాయణ, నవీన్, గంగాధర్, రంజిత్, చైతన్య,నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.