ఆర్థిక సహాయం చేయడంలోనే తృప్తి..

– పెండ్లికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
పేదలు నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడంలోనే తృప్తి ఉందని, పెళ్లి చేయడానికి డబ్బులు లేవని పలువురు దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే తనవంతుగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఆదివారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్  సిర్నాపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ ఆర్థిక పరిస్థితి బాగా లేక ఇంట్లో కూతురు పెళ్లి కి వచ్చిన పెళ్లిళ్లు చేయలేని పరిస్థితిలో ఉన్న అ కుటుంబం పై కులస్తులు మమకారం చుపి ఆర్థిక సహాయం చేసిన పెండ్లికి ఇంకా డబ్బులు లేక ఆ కుటుంబం దిగులు చేందింది.ఈ విషయాన్ని కోండ్రు దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి దృష్టికి తీసుకొని వచ్చారు.అ  బీద కుటుంబ పరిస్థితి లో ఉందని తెలుసుకొని మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి తనవంతుగా అ కుటుంబాన్ని పరామర్శించి కూతురు పెళ్లి ఖర్చుల కోసం పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.మాజి ఎంపీపీ దృష్టికి ఎవరైనా తిసుకుని వచ్చిన వెంటనే తనవంతుగా సహకారం అందజేసి కష్టకాలంలో తమకు వేన్ను తట్టి సహకారం జీవితంతం మార్చి పోలేని దాని పలువురు పేర్కొంటున్నారు. సహకరం చేసినప్పుడు ఆ కుటుంబం ఏ కులం, మతం జాతి చుడకుండ తమ వేన్నంటే ఉండడం ఇమ్మడి గోపి కే సాధ్యమని పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ గౌడ్,పిల్లలెందుకు వి సహకార సొసైటీ మాజీ చైర్మన్, కోమటి రాములు, రాకేష్, కోండ రాములు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.