నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టసభల్లో పెట్టి ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 11వ రోజు చేరాయి.దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. సామాజిక ఉద్యమాల నాయకుడు మందకష్ణ మాదిగ మూడు దశాబ్దాల నుండి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు.సమాజంలో దళితుల కోసం, బడుగు, బలహీన వర్గాల, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం అహర్నిశలు ఉద్యమిస్తున్నారని తెలిపారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని బడుగు, బలహీనవర్గాలందరికీ అందాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి తూరుగంటి అంజన్న మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుతాటిపాముల నవీన్‌మాదిగ, సూర్యాపేట పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బొజ్జ వెంకన్న, ఎంఆర్‌పీఎస్,ఎంఎస్పీ జాతీయ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు, సూర్యాపేట పట్టణ ఎమ్మెస్పీ ఇన్‌చార్జి దైద వెంకన్న,సూర్యాపేట ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి దాసరి వెంకన్న, చెరుకుపల్లి అర్జున్,మిద్దె శ్రవణ్‌కుమార్,బైండ్ల సంఘం యూత్ నాయకులు చిలక మహేష్, గ్యార కనకయ్య, మిద్దె నాగయ్య , చింత వినరుబాబు కొండేటిగోపి,గోల్కొండ లింగన్న, మచ్చ శ్రీను, మారపల్లి సావిత్ర,పంతం నర్సయ్య, ప్రమోద్, గద్దలనవీన్, కొరిపెల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చివ్వెంల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి కోరారు.ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష మంగళవారానికి 11వ రోజుకు చేరుకుంది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,రాష్ట్ర నాయకులు యర్ర వీరస్వామి,ఇన్‌చార్జి సతీష్, రాజు, జానకిరాములు, జాని, సతీష్, బోస్క గంగాధర్, మహిందర్, ప్రసాద్, చింటు పాల్గొన్నారు.