ఎస్సీ వర్గీకరణ మాదిగ జాతికి ఎంతో మేలు జరుగుతుంది… 

నవతెలంగాణ – జుక్కల్
ఈరోజు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (MCRHRD) కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో  కులగణన సర్వే ,ఎస్సీ వర్గీకరణపై చేపట్టిన చర్చలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్లుగా నానబెట్టి నానబెట్టి ఇవ్వకుండా వెల్లూర మాదిగలకు మోసం చేయడం రాజకీయ నాయకుల పరిపాటిగా మారింది . అనేక పోరాటాలు చేసినప్పటికీ ఏ ప్రభుత్వము స్పందించలేదు , ప్రస్తుతము ఎస్సీ వర్గీకరణ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి ఎస్సీ వర్గీకరణ చాలా అమూల్యమైనదని భావించి మద్దతు పలకడం మాదిగ లకు చాలా ఉపయుక్తంగా మారిందని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ జాతి నాయకులు ఎప్పటికీ రుణపడి ఉంటామని సమావేశంలో తెలియజేశారు.