– బిజేపి ఎస్సి మోర్చా ఆద్వర్యంలో తహసీల్దార్ కి వినతిపత్రం
నవతెలంగాణ – శంకరపట్నం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ అనుగుణంగా ఇచ్చిన హామీలను విస్మరించిన నేపథ్యంలో బుధవారం బిజేపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్, ఆధ్వర్యంలో శంకరపట్నం మండల తహసీల్దార్ బత్తుల భాస్కర్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజేపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనీల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలలో భాగంగా అంబేద్కర్ అభయ హస్తము కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం చేయాలి.
– ఎస్సీ ఉప కులాలు మాల, మాదిగలకు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలి.
– ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలి.
– ఎస్సీ హాస్టల్ కు పూననిర్మానానికి అవసరమైన నిధులు కేటాయించాలి.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువత స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలు సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య, కీసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మందాడి జగ్గారెడ్డి, నాయకులు కొయ్యడ కుమారస్వామి, రాసమల్ల శ్రీనివాస్, బొజ్జ సాయిప్రకాష్, వడ్లకొండ రాజేందర్, దాసరి సంపత్, ఎడిగె మధు, గొల్లిపెల్లి శ్రీనివాస్, తోట అరవింద్ తదితరులు పాల్గొన్నారు.