భయపెట్టే దక్షిణ..

భయపెట్టే దక్షిణ..‘మంత్ర, మంగళ’ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌ ఓషో తులసిరామ్‌ తాజాగా ‘దక్షిణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కల్ట్‌ కాన్సెప్ట్స్‌ మూవీ బ్యానర్‌ నిర్మాణంలో అశోక్‌ షిండే నిర్మాతగా ‘కబాలి’ ఫేమ్‌ సాయి ధన్షిక కథానాయికగా ‘మహాభారత్‌ మర్డర్స్‌’ ఫేమ్‌ రిషవ్‌ బసు  మరొక ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్‌కు విశేష స్పందన లభించింది. లేటెస్ట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకులు బుచ్చిబాబు విడుదల చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ మధ్య కాలంలో నన్ను భయపెట్టిన ట్రైలర్‌ ఇదే. తులసి రామ్‌ మళ్ళీ టాలీవుడ్‌కి మరో ట్రెండ్‌ సెట్టర్‌ సైకో థ్రిల్లర్‌ని ఇవ్వబోతున్నారు. ట్రైలర్‌  ఆసాంతం చాలా టెర్రిఫిక్‌గా ఉంది. థియేటర్‌లో ఈ సినిమా ఇచ్చే ఎక్స్‌పీరియన్స్‌ చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని  అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర బందం పాల్గొంది. ‘ఈ సినిమా సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెక్స్ట్‌ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతుంది. మా దర్శకుడు తులసి రామ్‌ ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన టేకింగ్‌, నేపథ్య సంగీతం, నటీనటుల నటన ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ని ఇస్తుంది. సినిమా అవుట్‌ఫుట్‌ సక్సెస్‌పై మరింత నమ్మకాన్ని పెంచింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్‌ షిండే అన్నారు.