వేంటడిన మృత్యువు.. ఆ దృశ్యం అత్యంత భయానకం..

– వేంటడిన మృత్యువు..
– ఆ దృశ్యం అత్యంత భయానకం..
– కింద నిలుచుని ఉన్న  నల్గురు మృతి..
– మృతులు యూపీ వాసులు
నవతెలంగాణ డిచ్ పల్లి:
రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం భయంకరంగా మారిపోయింది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారి శరీర భాగాలు చూసిన వారు కంటతడి పెట్టుకున్న పండగల కోసం స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలోని డీసీఎం రూపంలో నలుగురిని మృత్యు కబాలించింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయన్ పల్లి శివారులో చోటుచేసుకుంది. ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ పరిధిలోని చంద్రయాన్ పల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులంతా యూపీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. స్థానికులు, ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  జాతీయ రహదారి 44 పై శుక్రవారం రాత్రి ఓ వరి కోత యంత్రం రోడ్డుపై ఆగిపోగా భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదే సమయంలో యూపీ వైపు వెళ్తున్న బస్సు, ఓ లారీ ని ఢీ కొన్నాయి. బస్సులో ఉన్న వారంతా ఒకోక్కరుగా కిందికి దిగారు. అదే సమయంలో వెనుకాల నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బస్సు నుండి కిందికి దిగి నా సమయంలో డిసిఎం నల్గురి పై మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులు ఉత్తర ప్రదేశ్ లోని గోరఘ్ పుర్ కు చెందిన వారుగా పోలిసులు గుర్తించారు. దినిలో ప్రదీప్20, జీతు32, దుర్గేష్ ప్రసాద్ 19, జ్గానేష్ 22లు ఉన్నారు. వీరంత హైదరాబాద్ లో పనులు చేస్తుండే వారని పండుగ లో సమయం కావడంతో నల్గురు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని గోరఘ్ పుర్ కు వేళ్తుండాగ మార్గ మధ్యంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం లో మృత్యువాత పడ్డారు. ముందుగా బస్సు లారి డీ కొన్నప్పుడు బస్సులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని, మృత్యువు రూపంలో కిందికి దిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మిగిలిన వారు కన్నింటి పర్యంతం అయ్యారు. ఒకదని కోటి ముడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అంతిమంగా డిసిఎం వాహనం పై కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. రాత్రి పోలిసులు, ఇందల్ వాయి టోల్ ప్లాజా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి ప్రమాదాలకు కారణమయిన బస్సు లారి, డిసిఎం ను పోలిస్ స్టేషన్ లకు తరలించారు.