– అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ అనంతరామ్ నాయక్
నవతెలంగాణ – శాయంపేట
తపాల శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ అనంతరామ్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 30న మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అన్ని పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజలందరూ ఉపయోగించుకునేలా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలను చేకూర్చే పోస్ట్ ఆఫీస్ బీమా పథకాలను కొనుగోలు చేసుకుని, కుటుంబాలకు రక్షణ కల్పించుకోవాలని సూచించారు.