– క్షణక్షణం భయాందోళనలో ఉపాద్యాయులు..
– ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రుల మనవి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ సాగే అశ్వారావుపేట – భూర్గంపాడు రోడ్డు నిత్యం రద్దీ గా ఉంటుంది. ఈ మార్గంలో ఆర్టీసీ రోజుకు 18 బస్ సర్వీసులు నడుపుతుంది. మిగతా భారీ వాహనాలు,మిగతా ఆటోలు సరా మామూలే. ఈ నేపద్యం అశ్వారావుపేట – వినాయకపురం మార్గం మధ్యలో ఏదో ఒక చోట తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల ఊట్లపల్లి సమీపంలోను తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ క్రమంలో ఊట్లపల్లిలో ఈ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎంపీ యూపీ ఎస్ పాఠశాల విద్యార్ధిని విద్యార్ధులకు ఎపుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందోనని ఉపాద్యాయులు భయపడుతున్నారు.ఈ పాఠశాలలో 1 నుండి 7 వ తరగతి వరకు 76 మంది విద్యార్ధిని విద్యార్ధులు చదువుతున్నారు.పాఠశాలకు రాకపోకలు సమయంలో ఈ రహదారి గుండానే విద్యార్ధులు గుడిలోకి ప్రవేశించాలి చేసి ఉంటుంది.ఇంటర్వల్ సమయంలోనూ పిల్లలు బయటకు రావాలంటే భయం భయంగా రోడ్ దాటాల్సి వస్తుంది. మండలంలో అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు,మైనార్టీ పాఠశాల,ఎంపీ యూపీ ఎస్ ఊట్లపల్లి,వినాయక పురం కాలనీ,ఆసుపాక,ఎంపీ పీఎస్ కుడుములపాడు పాఠశాలలు ఈ రోడ్ పక్కనే ఉన్నాయి. పాఠశాలల పరిసరాల్లో ప్రమాద నివారణ చర్యలు అనగా స్కూల్ జోన్ సూచీలు,వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయాలని పాఠశాలల ఉపాద్యాయులు,తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి – ఎంపీ యూపీ ఎస్ ఊట్లపల్లి ప్రధానోపాధ్యాయులు కిషింధర్ రెడ్డి
విద్యార్దులు బడికి వచ్చి ఇంటికి చేరుకునే వరకు భయంగా గడపాల్సి వస్తుంది.రోడ్ రద్దీగా ఉండటం,తరుచూ పాఠశాల అటో ఇటో ప్రమాదాలు చేసుకోవడంతో గేటు కు వేసే ఉంచాల్సిన అవసరం వచ్చింది.పాఠశాల పరిసరాల్లో స్కూల్ జోన్ సూచీలు,వేగ నియంత్రణ లు ఏర్పాటు చేయాలి.