– వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ దినకర్, డీఈవో రామారావు
– లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్
నవతెలంగాణ – పెద్దవంగర
నేటి పోటీ యుగంలో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల వైపు దూసుకు పోవాలని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ దినకర్, మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, లయన్ వెంకటేశ్వర్ రావు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. సివీ రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈయన సందర్భంగా విద్యార్థులు చేసిన సైన్స్ నమూనాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను శాస్త్రీయ దృక్పథాన్ని వెలికి తీయాలని, భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్నారు. సమాజానికి దిక్సూచిలా విద్యార్థులు ఎదగాలని అన్నారు. సైన్స్ తోనే మానవ మనగడ ముడిపడి ఉందని తెలిపారు. పరిశోధన ఫలాలు సామన్యూలకు చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో బోధిస్తే విద్యార్థులు సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకుంటారన్నారు. సర్ సీవీ.రామన్ పరిశోధన ఫలితాన్ని ధ్రువీకరించిన రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. అపరిచితలతో అన్‌లైన్‌లో సమయాన్ని గడపొద్దని సూచించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎర్ర వెంకన్న మాట్లాడుతూ..సీవీ రామన్ కృషి ని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు సైన్స్ లో రాణించాలని అన్నారు. సాంఘిక రుగ్మతలను విడనాడి, మూఢనమ్మకాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని అన్నారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, ఉద్యానవన శాఖ అధికారి రాకేష్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ లక్ష్మీనరసింహారావు, వేలూరి శారద, సుంకరనేని నాగవాణి, దామెర సరేష్, వజినపెల్లి శైలజ, మొర్రిగాడుదుల శ్రీనివాస్, పెద్దవంగర నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుధారపు శ్రీనివాస్, ముత్తినేని శ్రీనివాస్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, ఏదునూరి రేణుక, జలగం సతీష్, అనపురం రవి గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ఉపాధ్యాయులు శ్రీధర్, హైమ, సురేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.