– తడిసి ముద్దైనా ప్రేక్షకులు
– భద్రత లేదంటు ఆగ్రహం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
సరదాగా సినిమాకనీ వెళితే ధియేటర్ యాజమాన్యమే ప్రేక్షకులకు రియల్ త్రీడీ మూవీ చూయించింది.నల్గొండ పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న బారీ వర్షం ఎస్ వి సి (నటరాజ్) ధియేటర్ నిర్లక్ష్యం,నిర్వాకాన్ని బయటపెట్టింది.ముంచెత్తిన వాన కారణం గా యాజమాన్య డొల్లతనం కూడా బయటపడినట్లయ్యింది. ధియేటర్ పై కప్పు నుంచి కురిసిన వాన తో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు.అంతేకాదు పై కప్పు ఎక్కడ కింద పడుతుందోననే భయంతో రెండు గంటల పాటు బిక్కు బిక్కు మంటూ కూర్చున్నారు. ఓ విధంగా చెప్పాలంటే తెర మీద కంటే….ధియేటర్ ఆవరణ లోనే ప్రేక్షకులకు త్రీడీ మూవీ చూయించింది యాజమాన్యం. వారి నిర్లక్ష్యం కారణం గా మధ్య లోనే కొందరు బయటికి వెళ్ళిపొగా మరికొంతమంది ప్రేక్షకులు నటరాజ్ ధియేటర్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.ప్రేక్షకులకు భద్రత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.