రెండవసారి నియామకమైన దినేష్ కులచారికి సన్మానం

నవతెలంగాణ – ఆర్మూర్ 

జిల్లా కేంద్రంలోని  నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ లో నిర్వహించినటువంటి బిజెపి జిల్లా సమావేశం లో మరోసారి జిల్లా అధ్యక్షునిగా నియామకమైన దినేష్ కులాచారి నీ, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్,  జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్  లు బుధవారం శాలువాతో ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి హయాంలోనే ఎంపీ ఎమ్మెల్యేలు ఏ విధంగానైతే గెలిచారో అదేవిధంగా ఎమ్మెల్సీలు సైతం గెలవాలని ఆ విధమైన ప్రణాళికలు రచించాలని, మరింత బలపడే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరినారు.