రెండవ రోజు కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి టీకాలు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం ధూపల్లీ గ్రామంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను రెండవ రోజు కూడా కొనసాగిస్తున్నారు. అసిస్టెంట్ వెటర్నరీ శశిరేఖ ఆధ్వర్యంలో 150 పశువులకు గాలికుంటు టీకాలను వేశారు. శుక్రవారం 500 పశువులకు టీకాలు వేయగా, శనివారం మరో 150 పశువులకు టీకాలు వేసినప్పుడు ఆమె పేర్కొంది. వెటర్నరీ అసిస్టెంట్ భీమ్రావు, సిబ్బంది సావిత్రి తదితరులు ఉన్నారు.