
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రెండవ విడత రైతు రుణమాఫీ సంబరాలను నిర్వహించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండవ విడత రైతు రుణమాఫీ రూ.లక్షన్నర లోపు పంట రుణం వున్న రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయు కార్యక్రమంను రైతు వేదిక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలంలోని రుణమాఫీ లబ్దిదారులు, అధికారులు వీక్షించారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపిడిఓ చింత రాజ శ్రీనివాస్, ఏఈఓలు రమేష్, సాయిరాం, పద్మ, లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.