– ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సిఎన్ మహేశ్వరన్…
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 566, తుంగతుర్తి నియోజకవర్గానికి 61 పోలింగ్ కేంద్రాలకు, మునుగోడుకు సంబంధించి 126 పోలింగ్ కేంద్రాలు, నకిరేకల్ నియోజకవర్గానికి 59 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం ఎన్ని వందల పన్నెండు టీమ్లను రెండో విడత ర్యాండ మైజేషన్ ద్వారా ఎన్నిక చేసినట్లు ఎన్నికల జనరల్ సి ఎన్ మహేశ్వరన్ తెలిపారు. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే జెండగే, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఏ భాస్కరరావు సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ విడుత ర్యాండమైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి మొత్తం 566 పోలింగ్ కేంద్రాలకు, తుంగతుర్తి నియోజక వర్గానికి సంబంధించి 61 పోలింగ్ కేంద్రాలకు, మునుగోడు నియోజక వర్గానికి సంబంధించి 126 పోలింగ్ కేంద్రాలు, నకిరేకల్ నియోజక వర్గానికి సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 812 టీములను రెండవ విడుత ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నిక చేయగా, ప్రతి టీములో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉంటారు. భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 5 మహిళా టీములు, ఒక దివ్యాంగుల టీమ్, ఒక యువత టీము ఎన్నిక చేయడం జరిగిందన్నారు. రెండవ విడుత ర్యాండమైజేషన్ కార్యక్రమం ద్వారా ఎన్నిక కాబడిన వారికి త్వరలోనే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి జగన్మోహన ప్రసాద్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.