– తహసీల్దార్ పులి సైదులుగౌడ్
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
రెండవ ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని తహసీల్దార్ పులి సైదులుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెండో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రాజకీయ పార్టీల మండలస్థాయి ప్రతినిధులతో అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీడీవో గుండగోని యాదగిరిగౌడ్, ఆర్‌ఐ తరుణ్, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి చెరుకు పెద్దులు, సీపీఐ నాయకులు వెంపటి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు శాంతిరెడ్డి, బీజేపీ తరాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గణేష్ పాల్గొన్నారు.