సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’.నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు.ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు. ఆ టీజర్‌కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు కోమల్ ఆర్.భరద్వాజ్ మాట్లాడుతూ, ‘శ్రీ చక్రం ప్రేరణతో ఈ కథ తయారు చేశాను. కల్కి, హనుమాన్, కార్తికేయలా ఇది మైథలాజికిల్ సినిమా. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా మన పురాణాల గురించి, మన మూలాల గురించి ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం. ఈ జనరేషన్‌కు నచ్చే సినిమా ఇది. తప్పకుండా ఈ చిత్రం అందర్నీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.’నాకు ఈ అవకాశం ఇచ్చిన కోమల్‌కి థ్యాంక్స్. అందరం ఎంతో తపనతో చేసిన సినిమా ఇది’ అని హీరోయిన్ మానస చెప్పారు. మరో నాయిక స్రవంతి పత్తిపాటి మాట్లాడుతూ,’ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.