నవతెలంగాణ – రెంజల్
వేసవికాలం ప్రారంభం కావడంతో గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు తాగునీటి అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. తాగునీటి ఎద్దడి రాకుండా ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదించి సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ముని నాయక్, ఎంపీవో గౌస్ ఉద్దీన్, సూపరిండెంట్ శ్రీనివాస్, పి ఆర్ ఏ ఈ, వినయ్ కుమార్, నీటిపారుదల శాఖ భుజెందర్, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.