
మద్నూర్ మండలంలోని అవల్గావ్ గ్రామపంచాయతీలో శుక్రవారం నాడు పథకాల అమలు కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం అధికారులు చేపట్టిన సర్వే వివరాలను గ్రామ కార్యదర్శి సతీష్ చదివి ప్రజలకు వినిపించారు. అధికారులు నిర్వహించిన సర్వే నివేదికలు గ్రామపంచాయతీ కి అతికించారు. ఈ కార్యక్రమంలో జిపి ప్రత్యేక అధికారి వెంకట నరసయ్య డిప్యూటీ తాసిల్దార్ భారత్ ఏఈఓ స్వామ్య ఐకెపిసిసి సుమిత్ర ఆశా వర్కర్ మీరాబాయి అంగన్వాడి కార్యకర్తలు పూజ మాదాబాయి ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తులు పాల్గొన్నారు.