సమాజంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవ వెలకట్టలేని దని మంగళవారం ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశంలో గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. మండలంలోని గోకుల్ తండాలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు సక్కుబాయి ని శాలువాలతో సన్మానించి, జ్ఞాపికతో పాటు పుష్పగుచ్చాలు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ హరి చంద్, మాజీ సర్పంచ్ లలిత లింబాద్రి నాయక్, కారోబార్ గంగారం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ నాయక్, రవి నాయక్, పీరు సింగ్, తదితరులు పాల్గొన్నారు.