కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలు గుర్తించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు.దక్షిణ ప్రాంగణంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జె.ల్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులను రెగ్యులర్ చేయడం జరిగిందని, యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా రెగ్యులర్ చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నారాయణ గుప్తా, డాక్టర్ యాలాద్రి, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, శ్రీకాంత్, డాక్టర్ నిరంజన్, వైశాలి, సరిత, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.