నవతెలంగాణ – పెద్దవంగర
హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ సేవలో అభినందనీయమని కాంగ్రెస్ మండల ఇన్చార్జి విజయ్ పాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన మహిళలకు మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మాజీ సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్ తో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుందని చెప్పారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొమురయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.