– జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ యువ నాయకులు
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు పీఏ మురళి సార్ సేవలు అమూల్యమైనవేని కాంగ్రెస్ పార్టీ మద్నూర్ ఉమ్మడి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పి ఏ మురళి సార్ జన్మదిన వేడుకలు సోమవారం జరుపుకోగా జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండలం డోంగ్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువ నాయకులు సచిన్ బాలు యాదవ్ నాగేష్ పటేల్ పరమేష్ పటేల్ ఇతర పలువురు యువకులు కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పి ఏ గా మీ విధులు జుక్కల్ నియోజకవర్గం వర్గం ప్రజలకు అమూల్యమైనవిగా పేర్కొన్నారు.