పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి..

నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా పారిశుధ్య కార్మికులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి స్థానిక సర్పంచ్‌ అరిగే సాయిలు ,పాలక వర్గం సభ్యులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే కార్మికుడు పారిశుద్ధ్య కార్మికులేనని వారి సేవలను వెలకట్టలేమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను సన్మానించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజేష్, కరోబర్ రతన్ కుమార్, ఉప సర్పంచ్ తనయుడు కలిల్, ఐకెపి ఏపీఓ గంగాధర్, వనజ, శోభ, అంగన్ వాడి టీచర్లు, గౌరమ్మ, గంగమణి, వైద్య ఆరోగ్య కార్యకర్త వెంకట్ లక్ష్మీ, ఆశ కార్యకర్తలు, నాయకులు భూమయ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.