ఉపాధ్యాయుల సేవలు ఎప్పుడూ మరువలేనివి..

నవతెలంగాణ-తొగుట 
విద్యార్థుల ఉన్నతికి నిరంతరం శ్రమించే ఉపాధ్యా యుల కృషి ఎప్పటికీ మర్చిపోలేనిదని గణపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు అంజలి అన్నారు. గురువారం ప్రాథమిక పాఠశాలలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి బది లీపై వెళ్లిన సుధాకర్, రాజశ్రీ, వెంకటేశ్వర్లు వనజ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు అంజలి మాట్లాడుతూ విద్యా ర్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేందుకు ఉపాధ్యాయుల యొక్క సేవలు మరువలేనివి అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాజేశ్వరి, పాఠశాల ఉపా ధ్యాయులు శేఖర్, లక్ష్మారెడ్డి, వనజ, రవీందర్, రాజ్ కుమార్,  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.