
– మండల అధికారులకు ఘనంగా సన్మానం
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి ఏజెన్సీలో గత ఆగస్టు 30వ తారీకు నుంచి సెప్టెంబర్ 5 వరకు విపరీతంగా కురిసిన భారీ వర్షాలకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం కృషిచేసిన మండల అధికారులు స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో సుమన వాణి, ఎంపీ ఓ శ్రీధర్ రావు, మండల ప్రత్యేక అధికారి అల్లెం, అప్పయ్య, ఇరిగేషన్ ఆఫీసర్ అరవింద్ గార్లకు మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఆర్ టి ఎస్ ల చేతుల మీదగా శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సుమారు పది రోజులు తుఫాన్ విస్తృతంగా కురిసిన వర్షాలకు వరదలకు ఎలాంటి అవాంఛనీయ జనులు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరుగుకుంటూ వారికి నిత్యవసర సరుకులు అందిస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. 24 గంటలు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడినందుకు వారికి మంత్రి సీతక్క కలెక్టర్లు వారి సేవలు అభినందినీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ శబరీష్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.