తపాలాశాఖ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ రాథోడ్ రామారావు కోరారు. మండలంలోని ఫోన్కల్ మేజర్ గ్రామపంచాయతీలో బుధ వారం ఏర్పాటు చేసిన డాక్ కమ్యూనిటీ డెవల ప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పోస్టా ఫీస్లలో సేవింగ్ అకౌంట్, ఇన్సూరెన్స్ పాలసీ వలన కలిగే లాబాలతో పాటు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుకన్య సంవృద్ధి ఖాతాల గురించి వివరించారు. చిన్న మొత్తాలతో పొదుపు చేసుకుంటేనే అవి పెద్ద మొత్తంగా మారి భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరు పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ సుధీర్ కుమార్, మోటివేషన్ అధికారులు శ్రీనివాస్ శరత్ ఫోన్ కాల్ బిపిఎం వంగపెల్లి శ్రీనివాస్, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.