
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన ఆదివారం, అరగంట అనే కార్యక్రమాన్ని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ప్రభుత్వ పార్కులో శుభ్రత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ పరిసర శుభ్రత కోసం రోటరీ చేపట్టిన ఆదివారం అరగంట కార్యక్రమం అందరికి స్ఫూర్తిదాయకమని ప్రతి వార్డులో ప్రజలు యువత పరిసరాల శుభ్రత పై అవగాహన పెంచుతూ ఆర్మూర్ స్వచ్ఛతకు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు పండిత్ పవన్, కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ ప్రాజెక్ట్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ లింబాద్రి గౌడ్, లింగాగౌడ్, కాంతి గంగారెడ్డి, పద్మ మురళి, పుష్పకరావు, చరణ్ రెడ్డి, శశిధర్ వన్నెల్దాస్ రాము,గోనె శ్రీధర మున్సిపల్ సానిటరీ ఇంచార్జ్ మహేశ్ కాలనీ సభ్యులు భోజ గౌడ్, పూజా నరేందర్ కౌన్సిలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు..