వార్డు ‌సభ్యుల సేవలు అభినందనీయం..

– సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ 
నవతెలంగాణ – డిచ్ పల్లి
సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం సబ్యుల పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ  వార్డు సభ్యులకు, పంచాయతీ కార్యదర్శిలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గం థీమ్ వంతు సహాయ సహకారాలు అందజేయడం  అభినందనీయమన్నారు. ప్రభుత్వం నుండి నిధుల మంజూరులో జాప్యం జరిగిన తమ సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, మంచినీటి వసతులు, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు నిర్మాణం, హరితహరం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వ హించామని తెలిపారు. కరోనా వంటి విపత్తు వచ్చిన తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ విధులను నిర్వహించారని కొనియాడారు. అనంతరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అందరూ కలిసి సర్పంచ్ లోలం సత్యనారాయణను ఘనంగా సన్మానించి అయిన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్యదర్శి అనుష తదితరులు పాల్గొన్నారు.