– బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో అభివృద్ధికి నోచుకోని గోజేగావ్ గ్రామ రోడ్డు
– రోడ్డు అభివృద్ధి నిధుల మంజూరు శిలాఫలకాలికే పరిమితం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామానికి వెళ్లే రోడ్డు అభివృద్ధి గత బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో నోచుకోలేకపోయింది రోడ్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హాయంలో పదేళ్ల కాలంగా జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగిన హనుమంతు షిండే రోడ్డు అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందర రోడ్డు అభివృద్ధి కోసం అలాగే వాగు పైన వంతెన నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు మంజూరైనట్లు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు శిలాఫలకాలికే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం గోజే గావ్ రోడ్డు పరిస్థితి గుంతల మయంగా మారి అద్వర్ణ స్థితిలో ఉండటం పట్ల ఆ గ్రామ ప్రజలకు రహదారి ఇబ్బందికరంగా మారడంతో ఆ గ్రామ యువ నాయకులు సంతోష్ పటేల్ దత్తు రాథోడ్ ఇద్దరు యువకులు ముందుకు వచ్చి గుంతల పూడ్చివేత కోసం స్వచ్ఛందంగా 25 ట్రాక్టర్ల మొరం మట్టి వేయించారు. రహదారి మొరమట్టితో గుంతలు పూడ్చి వేయించినందుకు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.