
మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో ఇటీవల గ్రామంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జెండా గద్దెను దళిత నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించడాన్ని నిరసించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేశారు. పోలీసుల చొరవతో గ్రామస్థులందరూ ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించాలని సూచించారు. కాగా సోమవారం గ్రామ పెద్దలతో చర్చించి జెండా గద్దెను తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు గ్రామ దళిత నాయకులు తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రడపాక పరంజ్యోతి, జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సూరం నిరంజన్, ప్రధాన కార్యదర్శి ఐతే మల్లేష్, సింగపురం జగన్, గుర్రపు యాదగిరి, కాసాని బొందయ్య, మేడ ఉప్పలయ్య, ఏడెల్లి ఐలయ్య, ఏడెల్లి శివ, సింగపురం ఉదయ్ కుమార్, సింగపురం హరిబాబు, సింగపురం రాము, సింగపురం చంటి, తోకల హరీష్, గాదెపాక సందీప్, గుర్రపు శ్యామ్ సుందర్, మేడ తరుణ్, ఎడ్ల సుభాష్, ఎడ్ల సంతోష్, ఏడెల్లి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.