
కాటారం మండలంలోని దామెరకుంట గ్రామానికి చెందిన ఆత్మకూరి స్వామి యాదవ్ ఇటీవల జాతీయ సాహిత్య సేవా రత్న అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం స్వామి యాదవ్ ను అఖిల భారత యాదవ మహా సభ జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షులు మేకల సంపత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంపత్ యాదవ్ మాట్లాడారు ఆత్మకూరి స్వామి యాదవ్ సేవలు గుర్తించి జాతీయ సాహిత్య సేవారత్న అవార్డు రావడం అభినందనీయమన్నారు.ఇంకా ఇలాంటి అవార్డుకు మర్రిన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కొమురయ్య యాదవ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బోయిని రాజయ్య యాదవ్ చింతల కుమార్ యాదవ్, కొడారి చిన్న మల్లయ్య యాదవ్ జగరి రాజయ్య యాదవ్ కొడారి బాపు యాదవ్ ఆత్మకూరి కుమార్ యాదవ్, మొగిలి లచ్చయ్య యాదవ్ మొగిలి రాజ్ కుమార్ పాల్గొన్నారు.