
మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో అండర్ 14,17 ఎస్.జీ.ఎఫ్ క్రీడలు సోమవారం అట్టహసంగా ప్రారంభమైయ్యాయి. సర్పంచ్ ద్యావనపల్లి మంజుల ముఖ్య అతిథిగా హాజరై ఎంఈఓ పావనితో కలిసి ఎస్.డీ.ఎఫ్ క్రీడలను ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆథ్లేటీక్స్ క్రీడలు నిర్వహించామని ఎంఈఓ పావని తెలిపారు. మండలంలోని అయా గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు హజరయ్యారు.