
మహిళలను శక్తిశక్తి వంతం చేయుటకే పార్లమెంట్ లో మహిళా శక్తి వందన్ బిల్లుకు రాష్ట్ర పతి ఆమోదముద్ర వేశారని బీజేపీ నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇంచార్జి కంకణాల నివేదిత రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో శక్తి వందన్ బిల్లు పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన కార్యక్రమాన్ని స్క్రీన్ పై మహిళా కార్యకర్తలకు చూపించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ చట్టం బిల్లును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని తెలిపారు. ఈ బిల్లు సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందినదని అన్నారు. ఈ బిల్లును ప్రధాని నరేంద్ర మోడీఎంతో ప్రతిస్టాత్మాకంగా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జండర్ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం అన్నారని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఈ సమయంలో రెండు చారిత్రక విషయాలు జరిగాయన్నారు. చాలా పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయన్నారు. సెప్టెంబర్ 20న లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా మరో రెండు ఓట్లు వచ్చాయని తెలిపారు. చివరకు మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింనదని తెలిపారు. వాస్తవానికి జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బిల్లును అమలు చేస్తామని బిల్లులోని నిబంధనలు చెబుతున్నాయన్నారు.2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జనాభా గణన నిర్వహించి, ఆ తర్వాత డీలిమిటేషన్ ఉంటుందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా పలు పార్టీలు వీలైనంత త్వరగా దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేయగా, ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు), ముస్లిం మహిళలను కూడా ఇందులో చేర్చాలని కోరాయన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఏరుకొండ నర్సింహా, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్లు మేకల స్వాతి, పద్మ, పెందోటి శిరీష, కత్తి శంకర్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.