హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన టీఎన్‌ఆర్ మోహిత్..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ఈ సీజన్‌లో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ 3/89, 6/38 అదుతే ప్రదర్శన కనబరిచి కెరీర్ బెస్ట్ నమోదు చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ మోహిత్ సత్తాచాటాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.