ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి విజయవంతం

The siege of MLA camp office was successfulనవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెలే క్యాపు కార్యాలయానికి  సీఐటీయూ జిల్లా  నాయకుడు  సురేష్  గొండ ఆధ్వర్యంలో నియేాజక వర్గం లోని ఎనమిది మండలాల నుండిభారీగా తరలి వచ్చిన అంగన్ వాడి టీచర్లు, హెల్పర్లు తమ డిమాండ్ల కోరకు సీఐటీయూ పిలుపు మేరకు ముట్టడిని సోమవారం విదయవంతం చేసారు. ఈ సంధర్భంగా జుక్కల్ ఎమ్మెలే క్యాంపు కార్యాలయం అవరణలో సమస్యలు తలెత్త కుండా జుక్కల్ ఎస్సై సత్యనారాయణ,  పోలీసులు ఇతర పీఎస్ ల సిబ్బందితో కలిసి బారీగా బమదోబస్తు ఏర్పాటు చేసారు. అంహన్ వాడి కార్యకర్తలు ఒక్కసారీగా దుసుకుని రావడంతో గేటు వద్ద పోలీసులతో సీఐటీయూ నాయకులు,  అంగన్ వాడీలతో   వాగ్వివాదం జర్గింది. ఒకరికొకరు తోసుకోవడంతో కొంత ఉద్రిక్తగా కొనసాగింది. జుక్కల్ మండలంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెలే  అందుబాటులో లేకపోవడంతో  బిచ్కుంద మండల సీనీయర్ కాంగ్రేస్ నాయకుడు శెట్కార్  మల్లికార్జున్ అప్పా  వచ్చి  అంగన్ వాడిల సమస్యలతో  కూడిన డిమాండ్ పత్రం  కూడిన    వినతి పత్రం తీసుకోవడం జర్గింది.  కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ, ఎస్ఎఫ్ఐ నాయకులు అజయ్,  నియేాజకనర్గంలోని మండలాల అంగన్ వాడిలు, హెల్పర్లు తదితరులు పాల్గోన్నారు.