ప్రజా ప్రతినిధుల మౌనమే శాపం

– బోధన్ రైల్వేకు శాపం గా మారింది.
– శివకుమార్ జేఏసీ నాయకులు
నవతెలంగాణ – బోధన్ టౌన్ 
బోధన్ పట్టణంలో రాకాసిపేట్ రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ కు వచ్చిన హైదరాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ లోకేష్ విష్ణోయ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ..  బోధన్ కు రైళ్లు పునరుద్దరించాలని. రాయలసీమ ఎక్సప్రెస్,బోధన్ -కరీంనగర్ డేము రైళ్లు బోధన్ నుండి ప్రారంభించాలని.రైల్వే స్టేషన్ లలో మరమ్మతులు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం జరిగింది. బోధన్ కు నిజాం నవాబ్ కలం నుండే రైల్వే సౌకర్యాలు ఉన్న నేడు బోధన్ కు రైళ్లు లేకపోవడం .గత కొన్ని సంవత్సరాలుగా బోధన్ -మీర్జా పల్లి ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేయడం జరిగింది. బోధన్ -రాయలసీమ ఎక్సప్రెస్ రైళ్లు బోధన్ నుండి ప్రారంభించాలని కోరారు. గత 13 నెలల నుండి రాయలసీమ వస్తున్న ప్రయాణికులను టికెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. బోధన్ రాకాసిపేట్ గాంధీపార్కు స్టేషన్ లలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణాలు చేపట్టాలని ప్లాట్ ఫారం ఎత్తు పెంచాలని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, సుందరీకరణ పనులు చేపట్టాలని. నిజామాబాద్ -పెద్ద పల్లి రైలు బోధన్ నుండి ప్రారంభించాలని కోరారు. బోధన్ రైల్వే వ్యవస్థ మెరుగుపడితే పేద , మధ్యతరగతి ప్రజలకు సౌకర్యంగా ఉందని డి ఆర్ ఎం గారిని కోరారు. బోధన్ -మీర్జాపల్లి ప్యాసెంజర్ 57502 రైలు పునరుద్దరించాలని రాయలసీమ ఎక్సప్రెస్ రైలు బోధన్ నుండి ప్రారంభించి సత్వరమే టికెట్లు అందించాలని. బోధన్ – బీదర్ రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని నిజామాబాద్ – కరీంనగర్ డేము 77259 బోధన్ నుండి ప్రారంభించాలని వాటికి టికెట్లు అందించాలి. రద్దు చేసిన ఎడపల్లి మరియు శక్కర్ నగర్ రైల్వే స్టేషన్లు తిరిగి ప్రారంభించాలని బోధన్ పట్టణంలో గాంధీ పార్క్ అలాగే ఎడపల్లి లోని రైల్వే స్టేషన్, ప్లాటుఫారం మరమ్మతులు చేపట్టాలని బోధన్ నుండి తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్ పల్లి వెళ్లే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని. బోధన్ విద్యార్ధి జేఏసీ గా,బోధన్ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ప్రజా ప్రతినిధుల మౌనం వహిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి రవాణా సౌకర్యాలపై దృష్టి సారించకపోవడం మరి రేపు ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని వెళ్తారో ఆలోచించాలని ప్రజలు రైల్వే సౌకర్యాలపై ప్రశ్నిస్తారని ఉన్నారు. ఇప్పటికైనా రైల్వే సౌకర్యాలపై ప్రజా ప్రతినిధులు గళం విప్పాలని అన్నారు. లేని పక్షం లో అన్ని రాజకీయ పార్టీ లను ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతరం చేసి బోధన్ కు రైళ్లు సాధించుకునే వారు పోరాడుతాం అని విద్యార్ధి జేఏసీ గా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు మోసిన్, నాగరాజు, సచిన్ పటేల్, సంజు తలరే, జునైద్, నవీన్, రాజేందర్, బడు, సుభాష్, సాయి కుమార్ పాల్గొన్నారు.