దాడికి దారితీసిన వాగ్వివాదం…

– ఒకరికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట

లారీ క్లీనర్ ల మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది.స్థానికుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని నందమూరి నగర్ కు చెందిన మడకం చిన్న, ఎస్కే రంజాన్ వేర్వేరు లారీలు పై క్లీనర్లు గా పని చేస్తుంటారు.సోమవారం రాత్రి విధులు ముగిసిన తర్వాత సమీపంలోని ఓ బెల్ట్ షాపుకు వెళ్లి అతిగా మద్యం సేవించి ఓ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం పెట్టుకున్నారు. స్థానికులు సర్ధి చెప్పడం తో ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కాగా మంగళవారం ఉదయం మడకం చిన్న, రంజాన్ ఇంటికి వెళ్లి దుర్భాషలాడాడు.ఈ క్రమంలోనే రంజాన్ ఇంట్లో ఉన్న గొడ్డలితో చిన్న పై దాడికి పాల్పడగా తీవ్ర గాయాలైయ్యాయి. అనంతరం స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి కు తరలించగా వైద్యులు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శ్రీరాముల శ్రీను వివరాలు సేకరించి, బాధితుడి ఫిర్యాదు మేరకు రంజాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.