పాలస్తీనా దేశాన్ని గుర్తించే నిర్ణయాన్ని స్లోవేనియా ప్రభుత్వం గురువారం ఆమోదించిందని ప్రధాని రాబర్ట్ గోలోబ్ ప్రకటించాడు. స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌లతో పాటు అలా చేసిన నాల్గవ యూరోపియన్ దేశంగా స్లోవేనియా అవతరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని దేశ పార్లమెంట్ తప్పనిసరిగా ఆమోదించాలి. అయితే 90 సీట్ల జాతీయ అసెంబ్లీలోని పార్టీలు ఏవీ వ్యతిరేకించనందున ఇది ఒక లాంఛనప్రాయంగా పరిగణిస్తారు. స్లోవేనియన్ పార్లమెంట్ సభ్యులు మంగళవారం ఓటు వేయనున్నట్లు పార్లమెంట్ స్పీకర్ ఉర్స్కా క్లాకోకర్ జుపాన్సిక్ ప్రకటించాడు. ”1967 నుంచి వున్న సరిహద్దుల లోపల పాలస్తీనా దేశాన్ని స్వతంత్ర, సార్వభౌమ రాజ్యంగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లేదా భవిష్యత్తులో శాంతి ఒప్పందంలో పాల్గొనే పార్టీలు అంగీకరించే సరిహద్దులు గల పాలస్తీనా” అని గోలోబ్ విలేకరులతో అన్నాడు.
ఈ తీర్మానం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉద్దేశించినది కాదని, ఇది ”శాంతి సందేశం” అని ప్రధాని ఉద్ఘాటించాడు. పాలస్తీనా ‘గుర్తింపు’ ప్రశ్న గురువారం స్లోవేనియా ప్రభుత్వ ఎజెండాలో లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా గజాన్ నగరమైన రఫాపై ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న ఘోరమైన దాడుల కారణంగా తాను వేగంగా నిర్ణయం తీసుకున్నట్లు గోలోబ్ చెప్పాడు. స్లోవేనియన్ ప్రెసిడెంట్ నటాసా పిర్క్ ముసార్, విదేశాంగ మంత్రి తంజా ఫాజోన్ ఈ నిర్ణయానికి మద్దతు తెలిపి మరిక ఆలస్యానికి ”కారణం లేదు” అని చెప్పారు.
గత కొన్ని వారాలుగా ఇజ్రాయిలీ దాడుల ఫలితంగా పెరుగుతున్న మరణాల సంఖ్య కారణంగా ఇజ్రాయెల్ అధికారులు పాశ్చాత్య దేశాల మద్దతులో స్థిరమైన క్షీణతను చూశారు. గత ఏడాది అక్టోబరు 7న పాలస్తీనా మిలిటెంట్లు హమాస్‌పై ఆకస్మిక దాడి చేసి 1,100 మందిని చంపి, 200 మందికి పైగా బందీలుగా చేసిన తర్వాత ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులలో ఇప్పటివరకు కనీసం 36,224 మంది మరణించారు.