సాంఘిక సంక్షేమ పాఠశాలను మండలానికి తరలించాలి.. 

– జెడ్పీ సర్వసభ్య సమావేశంలో గళమెత్తిన జెడ్పీటీసీ కవిత 
– ముంపు బాధితులకు పరిహారమందించాలని విజ్ఞప్తి 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండలానికి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హుస్నాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నారని.. బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు అందుబాటులో ఉన్నాయని.. ఈ ఏడాది ప్రాంభమయ్యే సమయానికి యథావిధిగా మండలానికి తరలించాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత మంగళవారం గళమెత్తారు. దాచారం గ్రామ శివారులోని 124 సర్వే నంబర్ యందు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల సంస్థ రైతుల నుండి సేకరించిన భూములకు, తోటపల్లి ఆన్ లైన్ రిజర్వాయర్ యందు ముంపునకు గురైన లద్దబండ, దాచారం గ్రామ బాధితులకు పరిహారం అందించాలని అధికారులను కోరారు. సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపినట్టు జెడ్పీటీసీ కవిత తెలిపారు.