
నవతెలంగాణ- డిచ్ పల్లి
సహకార సొసైటీ నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందు కు నడిపించాలని మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అన్నారు.గురువారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి ప్రాథమిక సహకార సంఘం వద్ద కొత్తగా నిర్మించిన నూతన చాంబర్ను మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, సోసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్, డైరెక్టర్లు, రైతులు, సర్పంచులతో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతు సోసైటి భవనం 33 ఏళ్ల క్రితం నిర్మించామని, ప్రస్తుతం దుకాణాల సముదాయం నిర్మించినందున వల్ల అందులోనే కార్యాలయంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ తారాచంద్ నాయక్ ను మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అభినందించారు. కార్యక్రమంలో ఇందల్ వాయి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, పాపాయి తిరుపతి, తెలు గణేష్, నర్సయ్య, సహకార సొసైటీ వైస్ చైర్మన్ స్వామి,ఉప సర్పంచ్ యెంకనోల్ల రమేష్, డైరెక్టర్లు నాసా రాజేశ్వర్, రైతు నాయకులు రవి, సాయిలు, రఘు, దాసు, ఆశన్న, రాజేశ్వర్, గణేష్, నర్సయ్య, సీఈవో నాగరాజు, నాగేశ్వర్ రావు, ఎంపిటిసి చింతల దాస్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.