– రైతులు సొసైటీలో రుణాలను రెన్యూవల్ చేసుకోవాలి
– రైతుల వద్దకే సోసైటీ సేవలు
– పీఎసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారని పీఎసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అమలుపర్చిన ఋణమాఫీకి సం ఘంలో అర్హులైన సభ్యులు రూ.1469, 526.76 లక్షలు ఇప్పటి వరకు ఋణ మాఫీ పొందిన సభ్యులు 1151, పొందిన మాఫీ రూ.368.76 లక్షలు అని తెలిపారు. వ్యవసాయానికి కావలసిన పెట్టుబడులు లభించక రైతులు ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని వాని సకాలం లో తీర్చలేక తమ స్థిరాస్తులను అమ్ముకుంటున్నారని రైతులే సహకార సంఘాన్ని స్థాపించుకొని, దాని ద్వారా తమకు కావల్సిన నాణ్యమైన పరికరాలు, విత్తనాలు, క్రిమీ సంహారక మందులు, ఎరువులు పొందవచ్చునని తెలిపా రు. రైతులు సోసైటీలో తీసుకొన్న ఎల్‌టి లోన్లు, తదితర లోన్లు చెల్లించి రిన్యూవల్ చేసుకోవాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు, సభ్యులకు సబ్సి డీ ద్వారా విత్తనాలను సరఫరా చేస్తున్నామన్నారు. రైతుల పండించిన పంటకు మద్దతుధరను చెల్లించేందుకు గాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల నుం చి రైతులకు మేలు చేస్తామన్నారు. సహకార సంఘం ముఖ్యమైన లక్ష్యం రైతులకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక, మధ్య కాలిక ఋణాలు అందజేయడం అంతేకాక రైతులకు బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తామన్నారు. కార్య క్రమంలో పీఏసీఎస్ సీఈఓ యాదగిరి, ఉపఅధ్యక్షులు శేఖరయ్య గౌడ్, డైరెక్టర్లు వార్ల భాస్కర్, సాయమ్మ, ఎం. మల్లేశం, అనంత లక్ష్మి,హన్మ్య నాయక్, కిష్టయ్య, సోసైటీ సిబ్బంది యాదయ్య, పాండు, శ్రీనివాస్, రైతులున్నారు.