ఎన్ని జన్మలదో ఈ బంధం
తెలియదు కానీ…
కలిసున్నా విడిపోయినట్లు
విడిపోయినా కలిసున్నట్లు
ఉండే ఈ బంధం…
ఎన్ని జన్మల కర్మలదో
తెలియదు నాకు !!
కలిసే ఉంటాయి
ఇరువురి మనసులు
అయినా కొన్నిసార్లు
బొమ్మా బొరుసులే !!
కలిసే చూస్తాయి
ఇరువురి కళ్ళు
అయినా కొన్నిసార్లు
కుడి ఎడమలే !!
నువ్వు గుండెలో
పదిలం అంటూనే
నాలుగు గదులుగ
విభజన చేసి
ప్రియా… అని పిలిస్తే
ఏ గోడ తలుపులు
తెరుచుకొని
పరవశించాలి !!
ప్రేమ స్థలం
రణస్థలం అయినా
పర్వాలేదని నన్ను
గాయపరిచి
నువ్వే పూజా పుష్పం అందిస్తే
ఏ గుండె గదిలో
దీపాన్ని వెలిగించుకోవాలి!!
ఐనా…
నేనెప్పుడూ
నీ వాడినే కనుక
ఇరువురి కళ్ళు నాలుగైనా
గుండె నాలుగ్గదులుగ
వీడినా
కళ్ళను విడదీసిన
నీ ముక్కుకున్న ముక్కుపుడకను
చూసేందుకు
నా హదయమెపుడో
మనోనేత్రమై నీ నుదుటిన
కుంకుమాకారం దాల్చింది!!
– మదుల, 7093470828