నాగార్జున అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఆస్కార్ విజేతలు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాతో నాగార్జునకు మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించడానికి రెడీ అయ్యారు. మేకర్స్ మొదటి సింగిల్ ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది’ పాటని విడుదల చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఎంఎం కీరవాణి ప్లజెంట్ వైబ్‌లను కలిగిన ఒక మెస్మరైజింగ్ మెలోడీని స్కోర్ చేసారు. రామ్ మిరియాల తన వోకల్స్‌తో కట్టిపడేశారు. చంద్రబోస్ మెలోడీ చార్ట్‌బస్టర్‌గా నిలిపే సాహిత్యాన్ని అందించారు. నాగార్జున, ఆషికా రంగనాథ్‌ల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలో విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పెప్పీ మెలోడీ చార్ట్-టాపింగ్ హిట్ అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు.