గాంధారి మండలంలోని చద్మల్ తండాలో రూ.500 నోట్ల దొంగ నోట్ల కట్టలు ప్రత్యక్షం కావడంతో మండలంలో కలవడం లేపుతుంది తాండవాసుల సమాచారం ప్రకారం చద్మల్ తండాలో సంక్రాంతి సందర్భంగా లక్ష్మమ్మ దేవి ఆలయ వారోత్సవాలు సందర్భంగా లక్ష్మమ్మ దేవి జాతర మూడు రోజులుగా వైభవంగా పాండవ వాసులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఆలయానికి సంబంధించిన డబ్బులు తండా వాసులు వడ్డీకి తీసుకుని జాతర ముందు మళ్ళీ ఆలయ కమిటీ వారికి తిరిగి చెల్లిస్తారు. ఈ ఏడాది కూడా తండా వాసులు వడ్డీకి తీసుకున్న డబ్బులు కమిటీ వారికి తిరిగి చెల్లించారు. జాతర అనంతరం మిగిలిన డబ్బులు మళ్ళీ తండా వాసులకు ఆలయ కమిటీ అప్పుగా ఇస్తుంది ఇలా ఇచ్చిన రూ.500 నోట్ల కట్టలలో దొంగ నోట్లు రావడంతో నివ్వెరపోయిన తండా వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆలయ కమిటీ వారి దగ్గర ఎవరెవరు అప్పు తీసుకున్నారు, ఎవరెవరు చెల్లించారు. ఎంతమంది అప్పు తీసుకున్నారు, వారి వివరాలను మరియు ఆలయ కమిటీ సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.