ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి..

The speed of grain purchases should be increased.నవతెలంగాణ – మల్హర్ రావు
వరిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఎన్ హెచ్ ఆర్సీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజేందర్, జిల్లా కార్యదర్శి వెన్నెపురెడ్డి కార్తీక్ రెడ్డి,మండల ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకటేష్, రైతులు ప్రభుత్వాన్ని,ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా కొయ్యుర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాట్లాడారు. ఒకవైపు మబ్బులు,మరోవైపు  అకాల వర్సాలతో  రైతులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మాచర్ వచ్చిన వెంటనే తోకెన్ ఇస్తూ కాంటాలు పెట్టాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ పరదాలు, గొనె సంచులు రైతులకు అందించాలన్నారు.