నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు నేనున్నానంటూ భరోసా అండగా వుంటా ఆదుకుంటా అంటున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్, జనం మెచ్చిన నాయకులు పాండురంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని రమావత్ చంద్రియ తిరుమలగిరి సాగర్ మండలం జమ్మానకోట తండా,నేనావత్ బిక్కి మంమూల తండా,పిల్లి బుచ్చయ్య అనుముల మండలం అనుముల గ్రామం,రమావత్ భిక్షం నాయక్ పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండా, మెరుగు వెంకమ్మ నిడమనూరు మండలం బంటువారి గూడెం,గుండు రాంబాబు నిడమనూరు మండలం, వెంగన్న గూడెం, గ్రామాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించడం జరిగింది.ఈసందర్బంగా మాట్లాడుతూ అణగారిన వర్గాలకు నిరుపేద కుటుంబాలకు మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు.నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.