– బహుమతులు అందజేసిన డిసిపి అడ్మిన్ బస్వా రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
క్రీడ స్ఫూర్తి వల్ల యువతలో దేశ భక్తి పెంపొందుతుందని డిసిపి (అడ్మిన్)బస్వా రెడ్డి అన్నారు.నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు క్రికెట్ లీగ్ ను ఎండి సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొదు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా 24 టీమ్స్ పేర్లు నమోదు చేసుకున్నాయి. క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిపి (అడ్మిన్) బస్వా రెడ్డి విచ్చేశారు. క్రీడల్లో గెలుపొందిన విన్నర్ టీం తెలంగాణ యూనివర్సిటీ, రన్నర్ టీం చాణక్య డిగ్రీ కళాశాల నిర్మల్ టీం లకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులకు పది లక్షల విలువ చేసే హెల్త్ కార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెల్నెస్ హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు.