ఎస్.ఆర్.ఎస్.పి కాలువక తూము ఏర్పాటు చేసి  చెరువు నింపాలి

–  వావిలాల గ్రామ రైతులు

నవతెలంగాణ – నెల్లికుదురు
ఎస్ ఆర్ ఎస్ పి కాల్వకు తూము ఏర్పాటు చేసి వావిలాల గ్రామంలోని చెరువు లోకి మీరు అందించి వ్యవసాయ పంటలను కాపాడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను కోరినట్లు వావిలాల గ్రామ రైతులు నలమాస శ్రీనివాస్ బొల్లేపల్లి సతీష్ వాంకుడోత్ బిక్ష నలమాస అశోక్ తవిశెట్టి రాకేష్ లు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించాలని బుధవారం కోరే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం పక్కన ఉన్నటువంటి ఎస్సారెస్పీ కాల్వకు ఒక తూమును ఏర్పాటు చేసి అట్టే కాలు ద్వారా మా గ్రామంలోని చెరువులోకి నీళ్లు వదిలినట్లయితే దాని ద్వారా వేసిన పంటలకు సాగునీరు అంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు అందుకోసం మా వావిలాల గ్రామానికి నీరు అందించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ను కోరగానే వెంటనే స్పందించి సంబంధిత ఎస్సారెస్పీ అధికారులకు ఫోన్ చేసి ఈ గ్రామంలోని సమస్యను పరిష్కరించాలని తెలిపినట్లు చెప్పారు వెంటనే సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు తెలిపి హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.