రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్-ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 తర్వాత ఈ బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘టైగర్ దండయాత్ర’ మొదలు కాబోతుంది. ఈనెల 17న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.